ఇప్పటి వరకు తెలుగు సినిమాలు దేశం లోనే ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను సాధించింది.  లక్షల్లో ఉన్న మార్కెట్ స్థాయి నుంచి కోట్ల లోకి ఎదిగేలా మన సినిమా లు చాలా హిట్ అయ్యాయి.  టాలీవుడ్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమా ఎన్నో రికార్డులను దేశవ్యాప్తంగా సృష్టించడమే కాదు ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాలు కూడా దేశంలోనే మన చిత్రాలు ఎక్కువగా నిలిచాయి.  బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమా స్థాయి పెంచుకుంటూ పోగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

టాలీవుడ్  ని ప్రపంచం మొత్తం చూసేలా చేసిన సినిమా బాహుబలి. 2015 లో వచ్చిన మొదటి భాగం 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 650 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2017 లో వచ్చిన బాహుబలి 2 సినిమా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 1607 కోట్ల షేర్  రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేసింది. ఆ తర్వాత అలా వైకుంఠపురం లో సినిమా ఈ రికార్డుకు దగ్గరిగా వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా 84 కోట్లతో నిర్మించగా 120 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం 77 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా విజయశాంతి ప్రధాన పాత్ర లో నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ 100 కోట్లతో నిర్మించగా మొత్తం 144 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర చిత్రం బాక్సాఫీసు వద్ద 70 కోట్ల షేర్ రాబట్టింది. రంగస్థలం 110 కోట్ల షేర్, సింహాద్రి 37 కోట్ల షేర్, మహేష్ బాబు పోకిరి 40 కోట్ల షేర్, భరత్ అను నేను 96 కోట్ల షేర్, ఇంద్ర 29 కోట్ల షేర్, నువ్వే కావాలి 19 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: