
మన టాలీవుడ్ హీరోల లో చాలామందికి ఎక్స్ ట్రా టాలెంట్ ఉంది. ఒకరు డాన్స్ బాగా చేస్తే , మరొకరు మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తూ ఉంటారు. ఇంకొకరు డైరెక్షన్ లో టాలెంట్ ఉంటే వేరొకరు రైటింగ్ తో తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఉంటారు. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అద్భుతమైన నటులు ఉండగా వారిలో రచయితలు కూడా దాగి ఉన్నారు. నవీన్ పోలిశెట్టి అడవి శేష్ లాంటి యంగ్ జనరేషన్ హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా రైటింగ్ పవర్ కూడా ఉండటంతో వారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అలా టాలీవుడ్ లో ఈ అరుదైన టాలెంట్ ఉన్న హీరోలను చూద్దాం. మోహన్ బాబు ప్రస్తుతం చేయబోతున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా కోసం స్క్రిప్ట్ రైటర్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా మరొక పాత్ర కూడా ఆయన రచయిత గా పోషించడం విశేషం. అయితే గతంలో ఎప్పుడూ కూడా మోహన్ బాబు రచన జోలికి వెళ్లలేదు. ఇకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అనుభవంతో కథలు రాసి సొంత నిర్మాణంలో వాటిని సినిమాలు గా చేయబోతున్నాడు హీరో నాని. వాల్పోస్టర్ బ్యానర్ పై ఇప్పటికే మూడు సినిమాలు నిర్మించాడు నాని.

మంచు విష్ణు మోసగాళ్ళు అనే తన సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందించాడు. రవితేజ కూడా కథలు సిద్ధం చేసుకుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అల్లరి నరేష్ తాను ఎంతో కష్టపడి కథలు సిద్ధం చేసుకో గా డైరెక్షన్ తాను చేయాలా వేరొకరి పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల నటుడిగా చేస్తూనే దర్శకుడిగా రచయితగా కొన్ని సినిమాలు చేశాడు. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాకు తానే కథ స్క్రీన్ ప్లే అందించాడు. హీరో సిద్ధార్థ్ గృహం సినిమా కి కథ స్క్రీన్ ప్లే అందించగా అడవి శేషు గూడచారి , క్షణం సినిమాలకు స్క్రీన్ పై రైటర్ గా చేశాడు.