చిరు, చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మెగా ఫ్యాన్స్ పండుగే. చిరంజీవి కి జోడీగా కాజల్ నటిస్తుంటే.. చరణ్ కు పెయిర్ గా పూజా హెగ్దే నటిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. సినిమా బడ్జెట్ 120 కోట్ల దాకా అవుతుండగా ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు చేయాలని టాక్. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో ఆచార్య అదరగొడుతుంది. 300 కోట్ల టార్గెట్ తో ఆచార్య రంగంలోకి దిగుతుందని చెప్పొచ్చు. మెగాస్టార్ స్టామినాకు 300 కోట్లు పెద్ద కష్టమేమి కాదు. అయితే అంచనాలను అందుకునేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.
తన ప్రతి సినిమాలో ఓ సోషల్ మెసేజ్ తో పాటుగా కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకునే కొరటాల శివ ఆచార్యలో కూడా అలాంటి ఓ మెసేజ్ ఇస్తాడని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో చరణ్ తో పాటుగా చిరు కూడా ఈక్వల్ జోష్ తో కనిపిస్తారని తెలుస్తుంది. కొరటాల శివ ట్రాక్ రికార్డ్ సూపర్ గా ఉండగా ఆచార్యతో ఆ హిట్ మేనియా కొనసాగిస్తాడని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి