
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశ శరవేగంగా కొనసాగుతుండగా త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా బిజినెస్ పార్టనర్ గా మహేష్ కు చెందిన GMB ఎంటర్టైన్మెంట్స్ వ్యవహరిస్తోంది.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి దాంతో ఇప్పుడు రాబోతున్న మూడో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో పాటు భారీ బడ్జెట్ కూడా అవసరం అవుతుంది. త్రివిక్రమ్ అల వకుంఠపురం లో సినిమా కు మించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అని అంటున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాకముందే మహేష్ ప్రవర్తన ఇటు త్రివిక్రమ్ కు అటు నిర్మాత రాధాకృష్ణ కు కొంత ఇబ్బందికరంగా ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహేష్ బాబు సినిమా మొదలు పెట్టాడు అంటే సినిమా కి సంబంధించి అన్ని విషయాలు పక్కాగా ఉంటేనే మొదలుపెడతాడు. తను స్క్రిప్ట్ కి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో రెమ్యునరేషన్ కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడు. తను చేసే సినిమా తన కెరీర్ పై ఎంతో ప్రభావం పడుతుది కనుక ఆ సినిమా రిలీజ్ దగ్గరినుంచి ప్రతిది ఆయనే చూసుకుంటారు.. ఈనేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలకు మహేష్ కు పొసగడం లేదన్నది ఇన్ సైడ్ వర్గాల సమాచారం. అంతేకాదు మొదట రెమ్యునరేషన్ అని చెప్పి ఆ తర్వాత బిజినెస్ పార్ట్ నర్ గా రావడం వారికి ఏమాత్రం నచ్చడం లేదట.