యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు.. నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఆరంగ్రేటం కోసం నందమూరి అభిమానులతో పాటు..యావత్ తెలుగు సినిమా అభిమానులు, గత ఐదు సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా పరిచయం అయ్యే సినిమా వార్తలు నాలుగైదు సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. ముందుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది.ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞను  పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నట్లు మరో వార్త బయటకు వచ్చింది.

ఇక ఆదిత్య369 లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం సినిమా ఉంటుందని మరో వార్త బయటకు వచ్చింది . ఇక బాలయ్య పైసా వసూల్ లాంటి సినిమా తీసిన పూరి జగన్నాథ్, మోక్షజ్ఞ కోసం వస్తున్నారు.. అంటూ మరో వార్త కూడా వచ్చింది. ఇక ఐదేళ్ల క్రితమే బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో  మోక్షజ్ఞ ఓ పాత్ర పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ నిజం కాలేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం కరోనా ముగిసిన తర్వాత వచ్చే ఏడాది బాలకృష్ణ వెండితెర అరంగ్రేటం ఉంటుందని తెలుస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య ఒప్పించి మోక్షజ్ఞ కాల్షీట్లు సైతం సొంతం చేసుకున్నారు. బాలయ్య సైతం ఒప్పుకోవడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ని తమ  బ్యానర్లోనే నిర్మించడానికి చూస్తానని , సాయి కొర్రపాటి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ డెబ్యూ  మూవీకి సంబంధించి బళ్లారిలో కొద్దిరోజులుగా కథాచర్చలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు టాప్ డైరెక్టర్లు తమ కథలను సాయికొర్రపాటికి వినిపిస్తున్నారట. ఈ కథలు ఫైనలైజ్ అయిన వెంటనే , మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి క్లారిటీ వస్తుందని సమాచారం. ఏది ఏమైనా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రావడం అభిమానులకు ఎంతో సంబరంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: