అందాల ముద్దుగుమ్మ
అలియా భట్ గురించి
బాలీవుడ్ సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. తన తొలి సినిమాలోనే గాఢమైన ముద్దు సన్నివేశాల్లో నటించి... అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ తర్వాత క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతుంది. మహేశ్ భట్ కూతురుగా ఇండస్ర్టీలోకి ఇచ్చి అనతి కాలంలో
అలియా భట్ తండ్రి మహేశ్ భట్ అని అందరూ అనేలా చేసింది. అంతే కాకుండా
బాలీవుడ్ లో ప్రస్తుతం నంబర్ వన్
హీరోయిన్ రేసులో కూడా ముందుంది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ... రెండు చేతులా సంపాదిస్తోంది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చాలా బాగా ఒంట బట్టించుకుంది. ఇలా నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ హాట్
బ్యూటీ ఫిట్ నెస్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. తాను వర్క్ అవుట్ చేసే ఫొటోలు అనేక సందర్బాల్లో బయటకు వచ్చాయి. చూడ్డానికి చిన్న పిల్లలా ఉండే ఈ అమ్మడు తన అందాల ఆరబోతతో పాటు నటనతో కూడా అభిమానులకు చేరువైంది. ప్రస్తుతం
అలియా భట్ ఉందంటే
సినిమా హిట్ అవుతుందనే రేంజ్ కు చేరుకుంది.
ఇకపోతే ఈ అమ్మడు తాజాగా 40డేస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించింది. ఇందులో భాగంగా జిమ్ లో చెమటోడుస్తుంది. ఈ ఫిట్ నెస్ చాలెంజ్ కు నేటితో 20 రోజులు పూర్తయ్యాయి. కాగా... తాను వర్కౌట్స్ చేయడం వల్ల నాజూగ్గా తయారైన తన సన్నని నడుమును చూపిస్తూ... ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ
బ్యూటీ షేర్ చేసిన ఫొటోకు ఆమె అభిమానులే కాకుండా
బాలీవుడ్ ముద్దుగుమ్ములు, ప్రముఖులు కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేశారు. ఇక ఈ చిన్నదాని అభిమానులైతే చెప్పక్కర్లేకుండా నడుమందాలను చూసి సంబరపడిపోతున్నారు. హాట్
బ్యూటీ మలైకా అరోరా,
కత్రినా కైఫ్,
మనీష్ మల్హోత్రా వంటి వారంతా వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.