తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ
చరిత్ర లిఖించుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం. కోట్లాదిమంది ప్రేక్షకులను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించి వారిని ఆహ్లాదపరిచాడు. స్టార్ హీరోలు సైతం ఆయనను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు.
హీరో కంటే కూడా బ్రహ్మానందం ను చూడగానే ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యేవారు. బ్రహ్మానందం ఉంటేనే
సినిమా చూస్తామని ప్రేక్షకులు డిమాండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బ్రహ్మానందం
సినిమా జీవితం అందరికీ తెలిసినదే అయినా ఆయన పర్సనల్ విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు.
బ్రహ్మానందం కుటుంబ విషయంలో మొదటి నుంచి చాలా ప్రైవేటు గా ఉండడం మెయింటెయిన్ చేశారు. ఆయన పెద్ద కొడుకు
గౌతమ్ సినిమాల్లో హీరోగా నటించిన వ్యక్తే. పల్లకిలో పెళ్లికూతురు అనే
సినిమా తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన
గౌతమ్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే
సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం. ఇక అందరికీ తెలియని మరో విషయం ఏమిటంటే బ్రహ్మానందం కి మరో కొడుకు కూడా ఉన్నాడు.
బ్రహ్మానందం చిన్న కొడుకు గురించి కనీసం
ఐడియా కూడా ఎవరికీ లేదనే చెప్పాలి. ఎప్పుడు చూసినా బ్రహ్మానందం
గౌతమ్ తోనే కనిపిస్తాడు. ఆయన ఫోటోలలో ఎక్కువ ఉంటాడు. కానీ రెండో కొడుకు నీ
ఎందుకు సినిమాకి దూరంగా ఉంచాడో మాత్రం ఎవరికీ తెలియదు. బ్రహ్మానందం రెండో కొడుకు పేరు సిద్ధార్థ. ఫారిన్ లోనే చదువు పూర్తి చేసుకుని ఈమధ్య ఇండియాకు వచ్చారు. ఆయనకు సినిమాపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. బ్రహ్మానందం మాత్రం
గౌతమ్ తన చిన్న కొడుకు తో తన
సినిమా కోరిక తీర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దు మాత్రం సినిమాలలో కాకుండా వ్యాపారం పైనే పూర్తి ఫోకస్ ఉంచాలని వ్యాపార రంగంలోనే స్థిరపడాలని అభిప్రాయపడుతున్నాడట.