
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని వైజయంతి మూవీ స్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. బాలీవుడ్ భామ ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, సుమలత, శివాజీరాజా, ప్రసాద్ బాబు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేసారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో మహేష్ తండ్రిగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ లో కనిపిస్తారు. అప్పట్లో రాజకుమారుడు మూవీ చాలా ప్రాంతాల్లో భారీ రికార్డ్స్ ని సొంతం చేసుకుని విజయవాడ లోని అలంకార్ థియేటర్ లో ఏకంగా 100 రోజులు ఆల్ షోస్ హౌస్ ఫుల్ గా ప్రదర్శింపబడి ఫస్ట్ మూవీతోనే మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాని రుజువు చేసింది.
ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు వండర్ఫుల్ టేకింగ్, హీరోగా మహేష్ సూపర్ యాక్టింగ్, హీరోయిన్ ప్రీతీ అంద చందాలు, ముఖ్యంగా మణిశర్మ అందించిన సాంగ్స్, బీజీఎమ్ తో పాటు ఫైట్ మాస్టర్ విజయన్ కంపోజ్ చేసిన అద్భుతమైన ఫైట్స్, కెమెరా మ్యాన్ అజయ్ విన్సెంట్ అందించిన ఆకట్టుకునే విజువల్స్ సినిమా ఇంత భారీ సక్సెస్ కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. కాగా ఈ సినిమా నేటితో సక్సెసఫుల్ గా 22 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా హీరో మహేష్ తో పాటు రాజకుమారుడు చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.....!!