సినిమా పరిశ్రమలో ఒకసారి సినిమా అవకాశాలు తగ్గిపోతే ఏ హీరోయిన్ కూడా తిరిగి కోలుకోవడం జరగదు. ఒకవేళ కోలుకున్నా అది అంతా సాధారణమైన విషయం కాదు. కెరీర్ మొదట్లోనే సినిమా అవకాశాలు వస్తే వాటిలో కొన్ని సినిమాలు హిట్లు గా మారి వారికి మరిన్ని అవకాశాలను వస్తాయి. కానీ కెరీర్ మొదట్లోనే సినిమా అవకాశాలు తగ్గిపోతే మాత్రం ఆ హీరోయిన్ కెరీర్ దాదాపు గా అయిపోయింది అని చెప్పాలి. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ నిత్యామీనన్ కు సినిమా అవకాశాలు వచ్చే టైంలోనే అవకాశాలు తగ్గడంతో ఆమె మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయింది.

ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అది తప్ప వేరే ఏ సినిమా కూడా ఆమె చేతిలో లేదు. ఈ సినిమాకి భారీ క్రేజ్ ఉన్న కూడా నిత్యమీనన్ నటించడం ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. పవన్ తో కలిసి మొదటిసారి నటిస్తున్న ఈమె ఇటీవలి కాలంలో బాగా బొద్దుగా అవడంతో దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేకపోయారు కానీ పవన్ కళ్యాణ్ ధైర్యం చేసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అవకాశం వచ్చినా కారణంగానో ఏమో నిత్య బరువు తగ్గింది.మునుపటిలా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నిజానికి నిత్యమీనన్ కు సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె అందాల ఆరబోత చేయకపోవడమే. అందాల ప్రదర్శన చేసిన హీరోయిన్ లు ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు అయ్యారు. కానీ నిత్యా మాత్రం నటనకు ఆస్కారమున్న, అందాల ప్రదర్శన లేని సినిమా లను చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్లీ కొంత క్రేజ్ పెంచుకున్న నిత్యామీనన్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. అయితే ఆ అవకాశాలు ఎక్కువగా గ్లామర్ పాత్రలే వస్తున్నాయట. దాన్ని కూడా ఇప్పుడు ఆమె రిజెక్ట్ చేస్తుండడం ఆమె కెరియర్ను మరొకసారి ప్రమాదంలో పడేస్తోంది. ఎంత పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే మాత్రం ఆమెకు సినిమా అవకాశాలు ఎలా వస్తాయి అని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: