టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ఆమె చేసిన సినిమాల గురించి అందరికీ తెలిసిందే. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసి  బాధ్యతలు చేపట్టింది. రాజకీయ నాయకురాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో సైతం నటించిన అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడపడుచు అని అందరూ అనుకుంటారు. తెలంగాణలో రాజకీయ నాయకురాలిగా పోటీ చేస్తుండటంతో ఆమె ఈ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనుకుంటారు కానీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఆమె జన్మించారు. తల్లిదండ్రులు శ్రీనివాస్ వరలక్ష్మి కూడా అదే గ్రామంలో జన్మించగా 1966లో విజయశాంతి జన్మించారు. ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస  సినిమాలు చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఆ సినిమాలో ఓ పవర్ఫుల్ లేడీ గా కనిపించి ప్రేక్షకులను ఎంతో అలరించింది ఆమె. మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుందట. చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ సినిమా లో కూడా ఈమె ఓ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇక రాజకీయ నాయకురాలిగా ఇటీవల బిజెపి పార్టీలో చేరి ప్రజలకు విశేష సేవలందిస్తోంది. ఆ రోజుల్లో విజయశాంతి కి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ ఉండేది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసి లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోల సరసన సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. గ్లామర్ పాత్రలను సైతం చేస్తూ ప్రేక్షకులను అప్పట్లో నిద్రపోకుండా చేసింది. డాన్స్ లలో నూ స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ స్టార్ హీరోయిన్ గా దశాభ్ద కాలంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: