చిరంజీవి ఇంట్లో వినాయకుడి ముందర చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలిసి ఇద్దరు పూజలు కూర్చున్నట్లు మనకి ఇక్కడ ఉన్న ఫోటోలు కనిపిస్తోంది.తన ఇంట్లో ఒక మట్టి వినాయకుడిని ప్రతిష్ట చేసి,ఆ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నా ఎంతో భక్తి శ్రద్ధతో చేసిన పూజ ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక విఘ్నేశ్వరుడికి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో.. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిపోయి, అందరూ సుఖశాంతులతో.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు చిరంజీవి.ఇక మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం తమ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.ఇక అంతే కాకుండా తను అందరూ బాగుండాలని కోరుకోవడం చేత ఇంకా సంతోషిస్తున్నాము అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు అభిమనులు.. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆచార్య సినిమా పూర్తి చేసుకుని.. వరుసపెట్టి సినిమాలను తీయబోతున్నాడు మెగాస్టార్.ఇక రాజకీయాలకు పూర్తిగా వదిలేసి సినిమాల వైపే.. ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.ఏదిఏమైనా మెగాస్టార్ చిరంజీవి ఇట్లు తమ అభిమానులను,అటు సినీ ఇండస్ట్రీ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి