బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రియాంక చోప్రా తన నటన నైపుణ్యాలను నిరూపించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ప్రియాంక పలు షోలలో హోస్ట్ గా కూడా చేస్తూ అలరిస్తోంది. ప్రియాంక చోప్రా తొలి అంతర్జాతీయ టీవీ సిరీస్ 'క్వాంటికో' ఆమెకు ప్రపంచ గుర్తింపునిచ్చింది. ప్రియాంక ఈరోజు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌లో కూడా మెరిసిపోతోంది అంటే దానికి ముఖ్యమైన కారణాల్లో అదొకటి. అయితే ఈ షో కారణంగా ఎవరూ ప్రియాంకను ప్రశంసించడం కానీ విమర్శించడం కానీ జరగలేదు.

కానీ తాజాగా ప్రియాంక చోప్రా రియాలిటీ షో 'ది యాక్టివిస్ట్' పై రచ్చ జరుగుతోంది. ఆమె పాప్ స్టార్ అషర్, నటి, డాన్సర్ జూలియన్నే హగ్‌తో కలిసి షోను హోస్ట్ చేయబోతోంది. కానీ ఈ షో ప్రారంభానికి ముందే వివాదంలో చిక్కుకుంది. వాస్తవానికి ప్రియాంక షో చాలా భిన్నమైన రియాలిటీ షో. ఇందులో 6 మంది యాక్టివిస్టులు పోటీదారులుగా పాల్గొని వివిధ జట్లుగా పోరాడతారు. వీటన్నిటి సక్సెస్ రేట్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ద్వారా కొలుస్తారు. అయితే డబ్బు కోసం యాక్టివిజాన్ని చాలా చిన్నదిగా మార్చినందుకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నెగెటివిటీని చూసిన ప్రియాంక చోప్రా వెంటనే స్పందించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆలస్యం చేయకుండా క్షమాపణలు చెప్పింది. ఈ పోస్ట్‌లో షో తప్పుగా జరిగిందని, అందులో పాల్గొన్నందుకు తనను క్షమించమని కోరింది.  "ఆలోచనల వెనుక ఉన్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడం, సరైన కారణాలను అందించడమే నా ఉద్దేశం. ప్రతి ఒక్కరి పని చాలా ముఖ్యం, వారు కూడా గుర్తింపు, గౌరవానికి అర్హులు. మీరు చేసే ప్రతి పనికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమె పోస్ట్ ద్వారా నెగెటివిటీని తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ దేశీ గర్ల్ తీరుతో అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. వాళ్ళు ఇంకా కోపంగానే ఉన్నారు. G20 సమ్మిట్‌లో పాల్గొనడమే 'ది యాక్టివిస్ట్' టార్గెట్. ఇక్కడ విన్ అయ్యేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను కూడా కలుస్తారు. ఈ షో ముగింపులో ప్రపంచంలోని ప్రముఖులందరూ పాల్గొంటారని ఊహాగానాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: