పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు మామూలు లేదు, అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. మొదట అజ్ఞాతవాసి గ్యాప్ తర్వాత దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా తో బాక్సాఫీసు వద్ద తన సత్తా చూపిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో భీమ్లా నాయక్ సినిమా ఒకటి. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ను కూడా పవన్ కళ్యాణ్ చక చక పూర్తి చేస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు.

అయితే ఈ  క్రేజీ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓ టి టి లో విడుదల చేయబోతున్నట్టు అనేక వార్తలు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి . అయితే ఈ వార్తలపై స్పందించిన భీమ్లా నాయక్ చిత్రబృందం అలాంటిది ఏమీ లేదు అని , భీమ్లా నాయక్ సినిమా ను ఖచ్చితంగా చెప్పిన తేదీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫస్ట్ లుక్ టీజర్ ను , ఒక పాటను విడుదల చేయగా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మరో హీరో అయిన రానా కు సంబంధించిన ఒక ప్రమాణం కూడా చిత్రబృందం ఈ మధ్యే విడుదల చేయగా దీనికి కూడా మంచి రెస్పాన్స్  వచ్చింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: