ఒకప్పుడు జానపద పాటలు కి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  జానపదం నేపథ్యంలో వచ్చిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.  కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో జానపదం అనే మాటే ఎక్కడా వినిపించలేదు. జానపద పాటలు లేకుండా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అటు సంగీత దర్శకులు కూడా తమ సినిమాల్లో జానపద గేయాలను తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడిపిస్తున్న పాటలన్నీ కూడా జానపదానికి సంబంధించినవే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు తెలుగు ప్రజలందరినీ ఉర్రూతలూగించిన జానపద గేయాలు మెరుగులు దిద్ది సినిమాల్లో పెట్టేస్తున్నారు దర్శకనిర్మాతలు.



 దీంతో మరోసారి ఆ పాటలన్నీ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో జానపదం  నేపథ్యంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ సాధించి యూట్యూబ్ లో కూడా రికార్డులు కొల్లగొట్టిన పాట సారంగదరియా పాట.  ఈ పాట ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కానీ ఈ పాటకు సరికొత్త హంగులు అద్ది లవ్ స్టోరీ సినిమా లో పెట్టేసాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.  ఇక ఈ పాట తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతలూగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పాటపై సాయి పల్లవి చేసిన డాన్స్.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అని కూడా అద్భుతం గానే ఉన్నాయి అని చెప్పాలి.



 సారంగదరియా పాట  లవ్ స్టోరీ సినిమా విడుదలకు ముందు నుంచే అటు యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తు దూసుకుపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి హృదయాలను గెలుచుకుంది ఈ పాట. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాట పై ఆడి పాడి ఎంజాయ్ చేసిన వారు కూడా ఉన్నారు.  ఇలా నాటి జానపదాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన శేఖర్ కమ్ముల ఈ పాటను అందరికీ హాట్ ఫేవరేట్ గా మార్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: