అయితే అల్లు అరవింద్ ఈవిషయాలను పట్టించుకోకుండా బాలకృష్ణ తో ‘అన్ ష్టాపబుల్’ టాక్ షోను అత్యంత భారీ స్థాయిలో ప్రజెంట్ చేయడమే కాకుండా ఈ షోను హోస్ట్ చేస్తున్న బాలకృష్ణ కు 5 కోట్ల వరకు పారితోషికం ఇవ్వడం మరింత ఆశ్చర్యంగా మారింది. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ‘అన్ ష్టాపబుల్’ షోలో బాలయ్య నాగార్జునను ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు టాక్.
వాస్తవానికి బాలయ్య నాగార్జునల మధ్య కూడ సరైన సాన్నిహిత్యం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వర రావు చబిపోయినప్పుడు కనీస మర్యాదను పాటిస్తూ బాలయ్య నాగ్ ను పరామర్సింపక పోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది అంటూ ఆప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఆవిషయాలను పక్కకు పెట్టి ఇప్పుడు బాలయ్య ‘అన్ ష్టాపబుల్’ కార్యక్రమంలో నాగ్ ను ఇంటర్వ్యూ చేస్తూ తాము ఇద్దరు చిన్నతనంలో చెన్నై లో ఉన్నప్పుడు ఎలా లైఫ్ ను గడిపారు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటారట. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఆహా లో మోహన్ బాబు ఎంట్రీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అరవింద్ ‘ఆహా` కార్యక్రమం కోసం మోహన్ బాబును ఆహ్వానించి ఒక తమిళ నిర్మాత రాసిన వెబ్ సిరీస్ ని గ్రాండ్ గా లాంచ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇలా అరవింద్ మెగా కాంపౌండ్ తో తనకు ఉన్న బందుత్వాన్ని పక్కకు పెట్టి ఇండస్ట్రీ రాజకీయాలతో సంబంధం లేకుండా అందర్నీ కలుపుకుపోతూ అందరివాడిగా మారిపోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి