బాలీవుడ్ భామ ఈషా గుప్తా హీరోయిన్ గా, విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్ లో కూడా నటించి బాగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక రామ్ చరణ్, బోయపాటి శీను డైరెక్షన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయత రామ..ఈ సినిమాలో "ఏక్ బార్ ఏక్" అనే సాంగులో ఈషా గుప్తా స్టెప్పులేసి ప్రేక్షకులను బాగా అలరించింది.


అయితే తాజాగా బికినీ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఈమె షేర్ చేయడం వల్ల అవి భాగ వైరల్ గా మారాయి. అయితే ఈ ముద్దుగుమ్మ  టాలీవుడ్ లోని ఒక డైరెక్టర్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా షూటింగ్ సెట్లో ఉండగా ఒక డైరెక్టర్ తనని దుర్భాషలాడాడని చెప్పుకొస్తోంది. ఆ డైరెక్టర్ తనని రెండుసార్లు అసభ్యకరంగా తిట్టాడని పేర్కొన్నది.

అయితే డైరెక్టర్ కోపానికి గల కారణం తను లేటుగా రావడమే కారణం కాకుండా తను వేసుకున్న కాస్టూమ్స్ అని తెలిపింది ఈషా గుప్తా. ఇక రెండవ సారి అతి దారుణంగా బండ బూతులు తిట్టాడు అని చెప్పుకొస్తోంది ఈమె. దాంతో ఆ డైరెక్టర్ ను  నానా మాటలు అనేసి ఆ సెట్ లో నుంచి బయటకు వచ్చేసాను అని తెలియజేసింది.

ఇక అలా బయటకు వచ్చిన  మూడు రోజుల తర్వాత ఆ డైరెక్టర్ ఫోన్ చేసి తనను క్షమించమని తెలియజేశాడట. ఇక ఇలాంటి చేదు విషయాన్ని స్వయంగా తాను ఒక ప్రముఖ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తెలియజేసింది. సినిమా డైరెక్టర్ పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె అభిమానులు మాత్రం ఆ డైరెక్టర్ పేరు చెప్పాలి అంటూ ఆమెను కోరుకుంటున్నారు. సచిన్ జోషి హీరోగా నటించిన"వీడెవడు" అనే మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: