సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం కొత్తేమీ కాదు. హీరోల వారసులు హీరోలుగా నిర్మాతల వారసులు నిర్మాతలుగా దర్శకుల వారసులు దర్శకులు గా వారి సత్తా చాటుతూ సినిమా పరిశ్రమలో ముందుకు పోతున్నారు. అయితే కొంతమంది దర్శకుల వారసులు హీరోలుగా వచ్చి తమ సత్తా చాటుతున్నారు. అలా హీరో లు గా ఉన్న వారెవరో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకొని తెలుగునాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న దర్శకుడు శోభ న్ తనయు డు సంతోష్ శోభన్ ఇప్పుడు హీరో గా దూసుకుపోతున్నా రు.

అలాగే కామెడీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ హీరోగా ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు. అల్లరి సినిమా తో ఆయన హీరో గా మొదలై ఇప్పటివరకు హీరో గా సినిమా లు చేస్తూనే ఉన్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కూడా హీరోగా తన సత్తా చాటుకున్నాడు. ఇటీవలే రొమాంటిక్ సినిమా తో ఆకాష్ హిట్ కూడా అందుకున్నాడు. ఇక సంచల న దర్శకుడు టీ కృష్ణ తనయుడు యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆయన మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక దర్శకుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కూడా హీరోగా పరిచయం కాగా ఇప్పుడు తమిళం లో సినిమాలు చేస్తున్నాడు. దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్ కూడా హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రముఖ నిర్మాత దర్శకుడు ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరో గా దూసుకుపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: