ఇక పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో వస్తోన్న భీమ్లా నాయక్ సినిమాను సైతం తాము కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట ను కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. అసలు ఆర్ ఆర్ ఆర్ లేనప్పుడు సంక్రాంతి లైనప్ లో జనవరి 13న సర్కారు వారి పాట, 14 రాధే శ్యామ్ , 15న భీమ్లా నాయక్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.
అయితే ఇప్పుడు జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ వస్తుండడంతో ఈ స్టార్ హీరోల ఆశలు చెల్లా చెదురు అయిపోయాయి. సర్కారువారి పాట ఏప్రిల్ 1కు వెళ్లి పోయింది. దీనిపై ఈ రోజు మైత్రీ మూవీ వాళ్లు అధికారికంగా ప్రకటించారు. ఇక భీమ్లా నాయక్ ను కూడా మార్చి లేదా ఏప్రిల్ చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఏదేమైనా ట్రిపుల్ ఆర్ దెబ్బతో స్టార్ హీరోలు కక్కలేక మింగలేక ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి