మళ్ళీ 2006లో అతని మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ACP బీమ్ రావు ఘడ్కే నేత్రుత్వంలో అరెస్ట్ చేయడం జరిగింది. అతను తన గ్రామంలో తన తల్లి మీద విరాళాలతో కట్టించిన రాధా నాయక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది.
15 రోజులు పోలీస్ కస్టడీ, 45 రోజులు జ్యూడిషల్ కస్టడీలో గడిపాడు. అయితే ఎటువంటి సాక్షాలు లేనందున నిర్దోషిగా విడుదలయినాడు. అయినా శత్రువులు వదలలేదు. అతనిపై మనీలాండరింగ్ కేసులు పెట్టి 62 రోజులు జైలుకు పంపారు. అతను జైలులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. అతను మహారాష్ట్ర మానవహక్కుల కమీషన్‌కు పిర్యాదు చేయడంతో కేసు విచారించిన జడ్జ్ అతన్ని కావాలనే అరెస్ట్ చేసారని దానికి కారణమైన ప్రద్న్య సవరదే పై మండిపడింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఆమె నుండి ₹25000 వసూలు చేసి SI కి ఇవ్వాలని తీర్పు చెప్పింది.
విడుదలైన తరువాత తను స్థాపించిన పాఠశాల లేవాదేవిలన్నీ చెక్‌ల రూపంలో జరిగాయని అవన్నీ విరాళాలు అని నిరూపించాడు. ఇలా ఒక నిజాయితీపరుడైన ఉద్యోగిని వివిధ కేసులతో నరకయాతనకు గురిచేసారు. ఒక్క అవినీతి కేసులే 27. ఇవన్నీ కొట్టివేయడం జరిగింది. ఒక్క కేసు కూడా నిరూపణ కాలేదు.. ఇంతకీ ఈ పోలీస్ ఇన్సపెక్టర్ ఎవరో తెలుసా..?? దయానాయక్. దాదాపు 8 సంవత్సరాలు ముంబాయ్ అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోలీస్ ఆఫీసర్. ఇతని మీద సినిమాలు కూడా వచ్చాయి. . హిందీలోనూ 3 సినిమాలు తీశారు.. కేవలం ఒక SI మాత్రమే ఇంత చేయగలిగినపుడు, అతనిపై ఉండే CI, DSP, ASP, SP, DIG, IG, DGP, హోంమంత్రి, ముఖ్యమంత్రి కూడా నిజాయితీగా పనిచేస్తే..
ఈ సమాజం ఎంత సురక్షితంగా ఉంటుందో కదా.. అలాంటి రోజులు తక్షణం రావాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి