ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ సీనియర్ హీరో గా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఎంతో మంది యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటికీ నందమూరి బాలకృష్ణ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతో మంది స్టార్ హీరోలు వెండితెరపై సత్తా చాటడమే కాదు అటుబుల్లి తెరపై కూడా హోస్టులు గా అవతారమెత్తి తమా టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో హోస్ట్ అవతారమెత్తారు. ఇక ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.


 అదే సమయంలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్  చేస్తూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక గతంలో నాచురల్ స్టార్ నాని కూడా బిగ్బాస్ కార్యక్రమంలో హోస్ట్ అవతారం ఎత్తాడ. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోహీరోయిన్లు హోస్ట్ అవతారమెత్తి అదరగొడుతున్నారు. ఇక ఇటీవల ఏకంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. అయితే నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేయగలడా అని కొంత మంది భావించారు.


 కానీ మొదటి ఎపిసోడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఇటీవలే విడుదలైన రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో చూసి అయితే అందరూ అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.. ఇటీవలే రెండవ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే హోస్ట్ గా ఉన్న బాలకృష్ణ నాని తో మాట్లాడుతూ స్పాంటేనియస్ పంచులు వేయడం.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అనే చెప్పాలి. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత ఏమే అనుకున్నాం కానీ బాలయ్య మామూలోడు కాదు అని అనుకుంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. బాలకృష్ణ ఈ రేంజిలో దూసుకుపోయాడు అంటే ఇకఎవరు పోటీ కూడా ఇవ్వలేరు అని భావిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: