పెడ్రో జమోరా ఒక ప్రసిద్ధ అమెరికన్ టీవీ సెలబ్రిటీ. పెడ్రో తాను స్వలింగ సంపర్కుడినని బహిరంగంగా అంగీకరించాడు. పెడ్రో ఎయిడ్స్‌తో బాధపడుతూ 1994 నవంబర్ 11న మరణించాడు.
ప్రఖ్యాత అమెరికన్ మోడల్ జియా సారంగి ఎయిడ్స్ కారణంగా మరణించారు. 1985 లో న్యుమోనియా కారణంగా, ఆమె ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆమె శరీరంలో hiv వైరస్‌ను కనుగొన్నారు. దీని తర్వాత కొంతకాలం అంటే 1986 నవంబర్ 18న ఆమె మరణించారు.
80వ దశకంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నిషా నూర్. ఒకప్పుడు హిట్ నటీమణుల జాబితాలో చేరిపోయింది. నిషా నూర్ కూడా ఎయిడ్స్‌తో మరణించింది. 2007వ సంవత్సరంలో నిషా నూర్ అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా నిషాకు ఎయిడ్స్ ఉందని తేలింది. ఈ కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆ తర్వాత 2007లో నిషా నూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఓ నిర్మాత ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టాడని, ఇక్కడి నుంచే ఎయిడ్స్ సోకిందని అంటారు.
ఆర్థర్ రాబర్ట్ ఆషే టెన్నిస్‌లో అత్యున్నత స్థాయిలో ఆడిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ ఆటగాడు. 1988లో అతనికి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికి ఐదేళ్ల క్రితం గుండెకు శస్త్ర చికిత్స సమయంలో హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించడం వల్లే అతనికి వ్యాధి సోకిందని భావిస్తున్నారు. 1993లో అతను ఎయిడ్స్ కారణంగా న్యుమోనియా బారిన పడ్డాడు. న్యూయార్క్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 6న మరణించాడు.
రాక్ హడ్సన్ 1950లు, 60లలో ప్రముఖ నటుడు. అతను డోరిస్ డే, జూలీ ఆండ్రూస్, ఎలిజబెత్ టేలర్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులతో రొమాన్స్ చేశాడు. హడ్సన్ 1985లో ఎయిడ్స్ సంబంధిత సమస్యలతో మరణించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి