సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి, బోయపాటి శ్రీను గురించి మనం పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. వీరిద్దరూ కలిసి సినిమా నిర్మించారు అంటే.. సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో మనకు తెలిసిన విషయమే. అలా తాజాగా ఇప్పుడు అఖండ మూవీ తో మన ముందుకు వచ్చారు. ఇక బాలయ్య కెరీర్లోనే అప్పటివరకు ఉన్న రికార్డులను సైతం ఈ మూవీ తిరగ రాస్తున్నట్లు గా సమాచారం. బాలకృష్ణ ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్రలో, అఖండ గా రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. బోయపాటి శ్రీను కు ఉన్న తన టాలెంట్ తో ఈ సినిమా మార్కుని మార్చేశారని చెప్పవచ్చు.

ఇదంతా ఇలా ఉండగా అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించింది యాక్టర్ నవీనారెడ్డి. ఈమె పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ కూడా, ప్రేక్షకులకు ఈమె పాత్ర తెగ నచ్చేసింది. అయితే ఈమె బాలకృష్ణ తో నటించడం మొదటి సినిమా కాదట. ఇదివరకే వెంకటేష్ ఎఫ్ 2 మూవీ లో కూడా ఒక కీ రోల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని ఆమెకు మొదటి చిత్రమట. ఆ తరువాత భీష్మ, అద్భుతం, వెంకీ మామ, హిట్ వంటి మూవీలలో నటించింది ఈమె. అయితే ఈ సినిమాలో ఈమె కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఇక అంతే కాకుండా దేవయాని, అర్థ శతాబ్దపు మూవీలో మాత్రం ఈమె మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు ఏవి ఈమెకు యాక్టర్ గా గుర్తింపు చేయలేకపోయాయి. కానీ అఖండ చేసిన ఈమె పాత్రకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈమె హైదరాబాద్ వాసి కావడం గమనార్హం. ఈమెకు ఒక సోదరి కూడా వున్నది. ఈ ముద్దుగుమ్మ చిరంజీవి కి వీరాభిమానియట. ఇక ఈమె కూడా ఎప్పుడూ సోషల్ మీడియా లోనే యాక్టివ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: