బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌కు ఎలాంటి గుర్తింపుపై ఆసక్తి లేదు. నటి స్టార్ కిడ్ అయినప్పటికీ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేదాకా మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, సుశాంత్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి నటులతో సారా పని చేసింది. సారా నటించిన 'అత్రంగి రే' చిత్రం మరికొద్ది వారాల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో నటి తన పెళ్లి గురించి మొదటిసారి మాట్లాడింది. తను ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి తన జీవితానికి సంబంధించిన అనేక అంశాల గురించి మాట్లాడింది. సారా తన వివాహం గురించి మాట్లాడుతూ తన తల్లి అమృతా సింగ్‌తో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని తాను వివాహం చేసుకుంటానని చెప్పింది.

ఒంటరి తల్లితో జీవించిన అనుభవాలను గుర్తు చేసుకోవడానికి ఆమె వెనుకాడదు. ఈ చిత్రంలో తన పాత్ర రింకూ గురించి సారా మాట్లాడింది. ఈ సినిమాలో రింకూ చెప్పే డైలాగ్ 'ఒకసారి అమ్మాయికి రెండూ దక్కితే చాలు' అని చెప్పింది. ఈ డైలాగ్ ద్వారా ఈ వాస్తవం నేటి యుగానికి పూర్తిగా వింతగా ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను అంటోంది ఈ బ్యూటీ.

సారా మాట్లాడుతూ 'అత్రంగి రే'లో రింకూ పాత్ర తనకు పూర్తిగా కొత్తదని చెప్తోంది. ఈ చిత్రంలో తొలి సారిగా ఆమె ఒంటరిగా డ్యాన్స్ చేయడంతో పాటు నార్త్, సౌత్ తలైవాస్ ఇద్దరితో కలిసి తొలిసారిగా వర్క్ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ సినిమాలో నేనే కథానాయికగా నటించడం నాకు కొత్త అనుభవం. ఆనంద్ జీ తనను ఒక సినిమా స్క్రీనింగ్‌లో కలిశారని, ఆయన తన సినిమాలో నన్ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నారని సారా చెప్పింది. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ చదివి ఈ సినిమా చేయాలని అనుకున్నాను. కాగా కొని రోజుల క్రితం 'అత్రంగి రే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముగిసిన తర్వాత సారా అలీ ఖాన్ కారులో కూర్చున్నప్పుడు, ఆమె చుట్టూ ఫొటోగ్రాఫర్లు గుమిగూడడంతో ఒక సెక్యూరిటీ గార్డు వారిని నెట్టాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సారా ఆగ్రహంతో వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: