ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే పొలిటికల్ నేపథ్యంలోనే సినిమాలు ఎవరినీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు అనే చెప్పాలి. ఒకే రకమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆ సినిమాలు ప్రేక్షకులను కొంత బోర్ కొట్టడంతో పాటు కూడా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే పొలిటికల్ నేపథ్యంలో సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన భావం వుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులు పొలిటికల్ సినిమాల జోలికి కూడా వెళ్లరు. అలాంటిది పొలిటికల్ చేయాలంటే దమ్ము ఉండాలి కథనంలో వెరైటీ ఉండాలి.

అలా పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను బాగా తెరకెక్కించడం లో సిద్ధహస్తుడైన దేవకట్ట ఇటీవల సరికొత్త కథా కథనాలతో రిపబ్లిక్ అనే సినిమాను తెరకెక్కించాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై రెండు నెలలు అవుతున్నా కూడా ఈ చిత్రంను ప్రేక్షకుల మరిచిపోలేకపోతున్నారు. మొదట్లో కొంత మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా ఈ చిత్రానికి భారీ రేంజ్ లో మంచి పేరు అయితే వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ నటనకు మంచి పేరు వచ్చింది. కలెక్టర్ గా అయన ఈ సినిమా లో ఎంతో బాగా నటించాడు. 

ఏదేమైనా ఇటీవల కాలంలో ప్రేక్షకులు మెచ్చిన పొలిటికల్ నేపథ్యంలోనే సినిమా రిపబ్లిక్. ఇటీవలే ఈ సినిమా ఓటీ టీ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. కొల్లేరు ప్రాంతంలో జరిగే అన్యాయాలు అక్రమాలు దురాక్రమణలకు ఓ సిన్సియర్ ఐఏఎస్ అధికారి వెళితే అక్కడి అన్యాయాలను ఎలా ఎదురించి ప్రజలను అన్యాయాలనుంచి కాపాడాడు. ఏ విధంగా అవినీతిని వాటిని రూపుమాపి తాను ముందుకు వెళ్లి ప్రజలకు సంతోషం తీసుకువచ్చాడు అనేదే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం సినిమా విజయానికి బాగా దోహదపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: