అయితే ఇక తమ అభిమాన హీరో కు సంబంధించిన అప్డేట్ విడుదలైంది అంటే ఫాన్స్ సృష్టించే హంగామా మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హంగామా సృష్టించారు. ట్రైలర్ రివ్యూ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు. ఈ సందర్భంగా జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం గమనార్హం. అదే సమయంలో విజయవాడ లోని అన్నపూర్ణ థియేటర్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేసారు అభిమానులు.
ఇక ఈ భారీ కటౌట్ కి కొబ్బరికాయలు కొట్టడమే కాదు పాలాభిషేకం సైతం చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ థియేటర్ లో ఏకంగా కేక్ కట్ చేసి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే అభిమానుల తాకిడి తట్టుకోలేక సిబ్బంది థియేటర్ గేట్లు మూసివేయడం గమనార్హం. అయినప్పటికీ అభిమానులు గేటు దూకి మరి థియేటర్ లోపలికి వెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పై కొంత మంది రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అవసరమైనప్పుడు తప్పక స్పందిస్తారు అంటూ అభిమానులు తెలిపారు. ఇక ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇరగదీశాడు అంటూఫాన్స్ అందరు మురిసిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి