సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఆయనకి కోట్లల్లలో అభిమానులు ఉంటారు. వరుస సినిమాలు చేస్తూ ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఓ వెలుగువెలుగుతున్నారు. ఇక ఈయన హీరోగా నటించిన పుష్ప చిత్రం తాజాగా విడుదలై బాక్స్ ఆఫిస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. సినిమా టాక్ పాజిటివ్ గా లేకపోయినా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు మాత్రం విమర్శకులు కూడా ఆయనను ప్రశంసిస్తున్నారు.

ఇక బన్నీ వ్యక్తిగత విషయాలకు వస్తే..ఆయన భార్య పేరు స్నేహ  రెడ్డి. ఈయన ప్రేమించి పెళ్లి  చేసుకున్నారు. ఓ సారి పబ్ లో దూరం నుంచి స్నేహ  ను చూసిన బన్నీ..మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఇక మన బన్నీకి స్పీడ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. లవ్ విషయంలో కూడా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వెళ్లి స్నేహకి చెప్పడం ఆమె కూడా బన్నీ ఇష్టపడడంతో వెంటనే యస్ చెప్పడం. ఇక ఇద్దరు వాళ్ల పెద్దవాళ్లకు చెప్పి ..ఒప్పించి..ఘనంగా పెళ్లు చేసుకున్నారు. ఇక సీన్  కట్ చేస్తే ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒక పాప,ఒక బాబు. కొడుకు పేరు అయాన్..కూతురు పేరు అర్హ. కొడుకు మ్యాటర్ పక్కన పెడితే కూతురు మాత్రం చిచ్చర పిడుగు తండ్రికి తగ్గటే ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా శాకుంతలం సినిమాలో కూడా నటించింది.

అయితే ఇద్దరు పిల్లలు పుట్టినా బన్నీ భార్య  స్నేహా మాత్రం ఇంకా యంగ్ లుక్ లోనే కనిపించడం  ఆశ్చర్యం కలిగించే విషయం. పెళ్ళికి ముందు ఎలా ఉందో పెళ్లి తరువాత ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా అలానే ఉంది. ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే స్నేహ తన ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఇక రీసెంట్ గా బ్లాక్ శారీని కట్టుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ చీరలో స్నేహ అందాల బొమ్మల కనిపిస్తుంది. ఇక ఈ ఫోటో చూసిన వారు కూడా స్నేహకు అదే చెపుతున్నారు. ఇక సమంత అయితే ఏకంగా స్నేహరెడ్డి ఫోటోకు హాట్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం స్నేహ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: