బంగార్రాజు సినిమాను ఈరోజు అనగా 2022 జనవరి 14 వ తేదీన భోగి పండుగ సందర్భంగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే.. సాధారణంగా చిన్న చిన్న సినిమాలలో ఎక్కువ గ్రాఫిక్స్ ను ఉపయోగించారని చెప్పవచ్చు. కానీ బంగార్రాజు సినిమాలో గ్రాఫిక్స్ చూస్తే బాహుబలి సినిమాను మించి అని చూసిన ప్రేక్షకులు అనేలా చేస్తోంది ఈ సినిమా.. ఇకపోతే ఈ సినిమాకు ఛాయాగ్రహకులు గా పీఎస్ వినోద్ తోపాటు ఆర్ సిద్ధార్థ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా గ్రాఫిక్స్ తో కూడుకొని ఉండటం గమనార్హం.


ముఖ్యంగా స్వర్గంలో స్టార్ హీరోయిన్లతో నాగార్జున చేసే సందడి మొదలు కొని నరకంలో యమధర్మరాజు దగ్గర చేసే సందడి వరకు ప్రతిదీ కూడా గ్రాఫిక్స్ రూపంలో చాలా చక్కగా రూపొందించారు.గ్రాఫికల్ ఎలిమెంట్స్ అన్నీ ఎంతో అద్భుతంగా ఉండడం తోపాటు  సినిమా కు ప్లస్ అయ్యాయి.. ప్రతి సీన్ లో కూడా  గ్రాఫిక్స్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది.  గ్రాఫిక్స్ కొంచం పాటలకు కాస్త క్యూట్‌నెస్ జోడించాయి అని చెప్పాలి. బాహుబలి సినిమాలు కథ పరంగా చూసుకుంటే పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ కేవలం గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా హైలెట్ అయిందని చెప్పవచ్చు . ఇక ఇదే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎక్కడ కూడా కాపీ కొట్టకుండా ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలను మించి పోయేలా ఈ సినిమాలో గ్రాఫిక్స్ చూపించడం గమనార్హం.


గ్రాఫిక్స్ విషయంలో బంగార్రాజు సినిమా అద్భుతహాః అనాల్సిందే.. ప్రతి విషయాన్ని.. సన్నివేశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ చాలా బాగుంది.. రమ్యకృష్ణ ఎప్పటిలాగే లేడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.. ఇక కృతి శెట్టి కూడా తన స్థాయికి మించి నటించిందని చెప్పవచ్చు. ఆమె తన నటనలో లీనమైపోయి చాలా అద్భుతంగా ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: