
కానీ, స్టార్ ఇమేజ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అయితే బుల్లితెరపై మాత్రం హోస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్ చేస్తోంది. ఇక మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈమె ఆండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఆండీ శ్రీనివాసన్ అమెరికా పౌరసత్వం కలిగినటువంటి ఒక వ్యాపారవేత్త. కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తొలి సారిగా మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్‌ను కలుసుకుంది. అప్పుడు ఏర్పడిన వీరి పరిచయం చివరకు పెళ్లి దాకా దారి తీసింది. 2006లో వీరి వివాహం పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ షాకింగ్ సీక్రెట్స్ ఏంటంటే.. ఆండీ శ్రీనివాసన్, మంచు లక్ష్మీలు చిన్నప్పటి నుంచి పక్క పక్క వీధుల్లోనే ఉండేవరట.
అలాగే ఓకే స్కూల్, కాలేజీల్లో చదివారట. కానీ, వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికి మాత్రం చాలా కాలమే పట్టింది. ఇక పెళ్లి తర్వాత భర్త ఆండీని మంచు లక్ష్మి ఇండియాకు వచ్చేయమందట. అయితే అందుకు ఆయన ఒప్పుకోలేదట. ఎంతో కష్టపడి అమెరికాలో ఒక వ్యాపార వేత్త గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాను.. ఇప్పుడు ఇండియాకు వచ్చి స్ట్రగుల్స్ పడలేనని ఆండీ శ్రీనివాసన్ చెప్పడంతో లక్ష్మి కన్విన్స్ అయిందట. కాగా, ఆండీ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటూ తన వ్యాపారాలను చూసుకుంటుండగా.. మంచు లక్ష్మి కూతురితో హైదరాబాద్‌లో నివసిస్తోంది.