హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ 'హీరో' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. టాలీవుడ్ కి పెద్ద నిధిలా మారుతుంది ఈ నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో సినిమాలో హీరో అశోక్ కంటే కూడా మెయిన్ హీరోయిన్ నిధి గ్లామర్ ఇంకా నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందుకే హీరో గల్లా అశోక్ కంటే కూడా హీరోయిన్ నిధి బాగా ఫేమస్ అవుతుంది.హీరో సినిమా విజయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ సినిమాలో నిధి పర్మార్మెన్స్ పై ప్రేక్షకులే కాదు సినిమా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సీనియర్ నటుడు జగపతి బాబు తనకు మళ్లీ హీరో కావాలని కోరిక ఉందని, ఎందుకంటే తనకు హీరోయిన్ గా నిధి అగర్వాల్ దొరికే అవకాశం ఉండొచ్చని ఆయన చెప్పారు. నిధి కేవలం అందంగా ఉండటమే కాదు థియేటర్లో తన పర్మార్మెన్స్ కు వస్తున్న స్పందన చాలా ఆకట్టుకుందని చెప్పారు.
 మరో సీనియర్ నటుడు నరేష్ అయితే నిధి అగర్వాల్ కున్న క్రేజ్ చూస్తుంటే మళ్లీ జన్మలో ఆమెలా పుట్టాలని ఉందని అన్నాడు. నిధి అంటే సందప అని తనని హీరోయిన్ గా పెట్టుకున్న సినిమాలన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ రాబడుతున్నాయని బ్రహ్మాజీ చెప్పారు. అలాగే హీరో సుధీర్ బాబు, దర్శకులు అనిల్ రావిపూడి, కొరటాల శివ కూడా నిధి స్క్రీన్ ప్రెజన్స్ ను ఇంకా అలాగే ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ ను మెచ్చుకున్నారు.బాలీవుడ్ లో టైగర్ శ్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నిధి సెకండ్ సినిమా తెలుగులో నాగచైతన్యతో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక మూడో సినిమాబ్యూటీ అఖిల్ సరసన మిస్టర్ మజ్నూ లో నటించింది. రామ్, పూరీ జగన్నాథ్ ల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫస్ట్ హిట్ అందుకుని తెలుగు తమిళ ఇండస్ట్రీలను ఎంతగానో ఆకర్షించింది. ఇక ఆ తర్వాత తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: