ఈ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన శివరాత్రి కానుకగా భీమ్లా నాయక్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో పాటు 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతులు అనేవి రావడంతో భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి.అలాగే యూఎస్ లో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి చాలా జోరుగా జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ సినిమాకు అన్ని ప్రాంతాలలో కూడా అనేక రకాల అనుకూల పరిస్థితులు అనేవి కూడా ఏర్పడ్డాయి.ఇక హిందీలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాలలో డీజే టిల్లు సినిమా మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను సాధిస్తోంది. అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు మాత్రం పెరగకపోవచ్చని సమాచారం తెలుస్తుంది. భీమ్లా నాయక్ సినిమా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చి హిందీలో కూడా భారీ మొత్తంలో కలెక్షన్లు వస్తే ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందనడంలో అసలు ఎటువంటి సందేహం అనేదే అవసరం లేదు.ఇక భీమ్లా నాయక్ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటించడం బిజినెస్ పరంగా ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. బాహుబలి సిరీస్ తో రానా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీస్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ రానా కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని సమాచారం అనేది తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కగా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఈ సినిమాకు బిజినెస్ అనేది జరిగింది. ఇక రేపు కాక ఎల్లుండే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని సమాచారం తెలుస్తుంది. ఈ నెల 21వ తేదీన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: