ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ఈమూవీ దర్శకుడు కొరటాల శివ పై జూనియర్ అభిమానులకు కొంత అసహనం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ‘ఆచార్య’ ప్రమోషన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలలో కొరటాల ఇచ్చిన సమాధానం అని అంటున్నారు. ఒక మీడియా సంస్థ తరఫున ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతినిధి కొరటాల తో తారక్ తో తీయబోతున్న సినిమా విశేషాలు ఏమిటి అంటూ ప్రశ్నించడం జరిగింది.
దానికి సమాధానంగా కొరటాల మాట్లాడుతూ ఇప్పుడు తన దృష్టి అంతా ‘ఆచార్య’ పైన మాత్రమే ఉందని ఈమూవీ విజయానికి సంబంధించిన ఫలితం వచ్చీ వరకు తాను మరో సినిమా గురించి ఆలోచించను అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ తారక్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా ఇప్పుడు బాధపడుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమా ఇంకా ప్రారంభం అవ్వకపోయినా ఎదోఒక అప్ డేట్ ఇస్తూ జూనియర్ మూవీ పై అంచనాలు పెంచవచ్చు కదా అన్న అభిప్రాయంలో అభిమానులు ఉన్నారు.
ఇది ఇలా ఉండగా కొరటాల జూనియర్ తో తీయబోయే కథ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు టాక్. దీనికితోడు ఈ మూవీలో హీరోయిన్ గా నటించవలసి ఉన్న అలియా భట్ ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ఒకవిధంగా కొరటాలకు ఊహించని షాక్ అంటున్నారు. ఆమెకు రాజమౌళి పై ఏర్పడిన కోపాన్ని కొరటాల పై తీర్చుకుంది అన్నప్రచారం జరుగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి