అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన నటనతో,  అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు ఫిదా చేయడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కాయి.  అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ సినిమాలు థియేటర్ లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వస్తుంది.  అందులో భాగంగా ప్రస్తుతం కృతి శెట్టి , సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,  నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం,  రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి నటిస్తోంది.  ఈ సినిమాలో ది వారియర్ సినిమా తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా ఒకే సారి విడుదల కాబోతుంది. ఈ మూవీ తో కృతి శెట్టి  తమిళ ప్రేక్షకులను కూడా అలరించబోతోంది. ది వారియర్ మూవీ కి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేయగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్న కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూ లో తన డ్రీమ్ రోల్ ఏమిటి అనేది తెలియజేసింది. తనకు రొటీన్ పాత్రలు చేయాలి అని లేదని తను నటించే సినిమాలో తన పాత్ర నచ్చితేనే సినిమాను చేస్తాను అని తెలియజేసింది. అలాగే తనకు రాజకుమారి పాత్రలో కనిపించాలని ఉందని, అదే తన డ్రీమ్ రోల్ అని అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: