‘గీత గోవిందం’ బ్లాక్ బష్టర్ హిట్ తరువాత పరుశురామ్ కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే అతడు తన తదుపరి సినిమాను టాప్ హీరోతో మాత్రమే చేస్తాను అని పట్టుపట్టి రోజులు గడపడంతో అతడికి టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం చాల ఆలస్యంగా వచ్చింది. చిట్టచివరకు మహేష్ అంగీకరించడంతో పరుశురామ్ కల నెరవేరింది. ఇది అంతా బయటకు కనిపించే విషయం.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మూవీ చిత్రీకరణ సమయంలో మహేష్ పరుశురామ్ ల మధ్య గ్యాప్ వచ్చింది అంటూ అనేక గాసిప్ లు హడావిడి చేసాయి. అప్పట్లో ఈ గాసిప్పుల పై పరుశురామ్ ఏమాత్రం స్పందించలేదు. ‘సర్కారు వారి పాట’ విడుదల తేదీ దగ్గర పడుతున్న పరిస్థితులలో పరుశురామ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మహేష్ కు మధ్య వచ్చిన ఆ గాసిప్ లపై స్పందించాడు.
ఒక టాప్ హీరోతో ఒక భారీ సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా ఎదో ఒక విషయంలో ఆ హీరోతో చికాకులు వస్తాయని అయితే ఆ చికాకులు గ్యాప్ కాదు అంటూ కామెంట్ చేసాడు. తనకు మహేష్ కు మద్య ఎటువంటి గొడవలు జరగలేదనీ అయితే ‘సర్కారు వారి పాట’ మొదలుపెట్టిన తరువాత మూడు కరోనా వేవ్ లు రావడంతో ఆమూవీ ప్రాజెక్ట్ ను మహేష్ అదేవిధంగా తాను మూడు సంవత్సరాలు తమ భుజాల పై మోయవలసి రావడంతో కొన్నికొన్ని సందర్భాలలో అసహనం వచ్చి ఉండవచ్చు అని కామెంట్ చేసాడు.
ఒక టాప్ హీరోతో సినిమా తీస్తున్నప్పుడు అనేక ప్రాక్టికల్ ప్రోబ్లమ్స్ వస్తాయని మొదట్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుపెట్టి ఆతరువాత రామోజీ ఫిలిం సిటీకి మార్చిన్నప్పుడు ఒక హీరోకి ఉదయం మేకప్ వేసుకుని తన ఇంటి నుండి గంట జర్నీ చేయాలి అంటే చికాకు వస్తుంది కదా అంటూ పరుశురామ్ తనకు మహేష్ తో చిన్నచిన్న చికాకులు ఉన్నాయి కాని గ్యాప్ లేదు అని క్లారిటీ ఇచ్చాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి