పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాజాగా భీమ్లా నాయక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకు క్రిస్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా,  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో ఈజిప్ట్ క్వీన్ పాత్రలో బాలీవుడ్ హాట్ నోరా ఫతేహి నటించబోతున్నట్లు తెలుస్తోంది.  

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించబోతున్నాడు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను  చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు.  పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా హరీశ్ శంకర్,  పవన్ కళ్యాణ్ గురించి భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ...  పవన్ కళ్యాణ్ గారు తన కెరియర్ లో మొట్ట మొదటి సారి భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు.  ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. నేను ఇది వరకు పవన్ కళ్యాణ్ గారితో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గా నటించడం వల్ల ఆ పాత్రకు ఒక పరిమితి ఉంది. అందువలన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా లో 80 శాతం వరకు పోలీస్ యూనిఫాం లోనే కనిపిస్తారు.  ఆ సినిమాలో నేను,  పవన్ కళ్యాణ్ స్టైల్ , కాస్ట్యూమ్స్ ని మిస్ అయ్యాను.  ఈ సారి పవన్ కళ్యాణ్ ను మీరు కలర్ఫుల్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో చూస్తారు.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తాడు అని తాజాగా హరీష్ శంకర్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: