ఈసంవత్సరం పూజా హెగ్డేకు ఏమాత్రం కలిసి వచ్చినట్లు కనిపించడంలేదు. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న పూజా హెగ్డే తన రూట్ ను బాలీవుడ్ కు మార్చి సల్మాన్ ఖాన్ తో సినిమాను చేస్తూ మధ్యలో తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడానికి కాన్స్ ఫెస్టివల్ కు వెళ్ళి అక్కడ రకరకాలుగా ప్యాషన్ షూట్స్ చేస్తూ కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసిపోవాలని రకరకాల ఫ్యాషన్ డిజైనర్స్ చేత డిజైన్ చేయించుకున్న రకరకాల షూట్స్ వేసుకుని శక్తిమేరకు ఎక్స్ పోజింగ్ చేసినప్పటికీ ఆమెను అంతర్జాతీయ ఫోటో గ్రాఫర్లు పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వస్తున్నాయి.


ఇదే కాన్స్ ఫెస్టివల్ హాజరైన 48 సంవత్సరాల ఐశ్వర్యరాయ్ గ్లామర్ ముందు పూజా గ్లామర్ తేలిపోయిందని మీడియా వార్తలు రాస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ఫెస్టివల్ లో పూజా వేసుకున్న ఒక డ్రస్ గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. పూజా వేసుకున్న ఈ వైట్ కలర్ డ్రస్ ఖరీదు లక్షలలో ఉంటుందట.


చాల సింపుల్ గా కనిపించే ఈ డ్రెస్ ను ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ టోనీ మేటిసెవ్ స్కీ డిజైన్ చేసాడట. ఒకవైపు బాడీకి అతుక్కుపోయినట్టు కనిపిస్తూనే మరోవైపు ఎద మెడ భాగలో పెర్ ఫెక్ట్ డిజైనింగ్ లో ఈ డ్రస్ ఉండటంతో ఈ డ్రస్ కు అన్ని లక్షలు ఖర్చు అయింది అని అంటున్నారు. అయితే ఈ డ్రస్ కు అంతర్జాతీయ మీడియా నుండి పెద్దగా స్పందన రాలేదు. పూజా హెగ్డే అభిమానులు మాత్రం ఈ డ్రస్ గురించి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసారు.


వాస్తవానికి ఈ ఫెస్టివల్ కు తమన్నా కూడ వచ్చింది అయితే ఆమెను కూడ పెద్దగా పట్టించుకోలేదట. ఈ ఫెస్టివల్ పూర్తి అయిన తరువాత పూజా తిరిగి ముంబాయ్ వచ్చి సల్మాన్ ఖాన్ షూటింగ్ లో పాల్గొంటూ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీలో మహేష్ పక్కన నటించబోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: