అందాల ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణి ప్రియదర్శన్ అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. 

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ హలో సినిమా ద్వారా కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది.  ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది .

ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో చిత్రలహరి , రణరంగం వంటి మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ రెండు మూవీ లలో చిత్రలహరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.  కళ్యాణి ప్రియదర్శన్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , మలయాళ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. కొన్ని రోజుల క్రితం కళ్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్ గా నటించిన మనాడు సినిమా  మంచి విజయాన్ని  సాధించింది . ఈ మూవీ లో శింబు హీరోగా నటించాడు . 

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను కళ్యాణి ప్రియదర్శిన్ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలలో కళ్యాణి ప్రియదర్శన్ ఎల్లో కలర్ లో ,  డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కళ్యాణి ప్రియదర్శిన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: