సూపర్ స్టార్ మహేష్ తో త్వరలో ఎస్ ఎస్ రాజమౌళి ఒక భారీ మూవీ తీయనున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా మూవీ గా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ సినిమాని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మించనుండగా గతంలో రాజమౌళి తీసిన సినిమాల యూనిట్ మొత్తం దాదాపుగా ఈ ప్రతిష్టాత్మక మూవీకి కూడా పనిచేయనున్నట్లు టాక్. మొదటి నుండి అందరిలో కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

తొలిసారిగా సూపర్ స్టార్ తో తీస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ యొక్క కథ, కథనాల పై దర్శకుడు రాజమౌళి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. సౌత్ ఆఫ్రికా లోని అడవుల నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ కం అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందని, ఆ తరహా కథ పై కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నాం అని ఇటీవల ఈ మూవీ కథకుడు విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

అయితే విషయం ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ కి వెళ్లిన దర్శకుడు రాజమౌళి నిన్న ఇండియాకి తిరిగి వచ్చారని, అలానే రేపటి నుండి మహేష్ బాబు మూవీ కథ పై ఆయన పూర్తిగా దృష్టి పెట్టనున్నారని, గతంలో తాను తీసిన బాహుబలి రెండు సినిమాలు అలానే ఆర్ఆర్ఆర్ మూవీస్ ని మించేలా ఈ సినిమా తెరకెక్కేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం .మొత్తంగా జక్కన్న ఇండియాలో ల్యాం అవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ భారీ మూవీ యొక్క ఇన్నర్ హైప్ ని బట్టి చూస్తుంటే తప్పకుండా త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ ఎంతో భారీ విజయం కూడా అందుకునే ఛాన్స్ గట్టిగా కనపడుతోందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: