బిత్తిరి సత్తి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు, అలాగే అతడి మాటలు, స్లాంగ్ అంటే కూడా అందరికీ చాలా చాలా ఇష్టం. అనతి కాలంలోనే చిన్న స్థాయి నుండి ఉన్నతి స్థాయికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు సత్తి. ప్రతిభ, పట్టుదల ఉంటే చాలు, ఇక అందం, బ్యాగ్రౌండ్ వంటివి లేకపోయినా ఇండస్ట్రీలో ఎదగొచ్చు అని నిరూపించాడు మన బిత్తిరి సత్తి. న్యూస్ మీడియా నుండి వెండి తెర వరకు వచ్చిన బిత్తిరి సత్తి కి ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాలలోను ఇతడికి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతడి కోసమే న్యూస్ ను చూసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.. అంతగా న్యూస్ ఛానల్ లో పాపులర్ అయ్యాడు బిత్తిరి సత్తి. తన వాక్చాతుర్యం తో, బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల్ని సరి కొత్త తరహాలో కడుపుబ్బ నవ్విస్తు అందరికీ దగ్గరయ్యాడు.

తీన్మార్ వార్తలు చెబుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సత్తికి ఆ తరవాత టెలివిజన్ షో లలై ఇతనికి పిలిచి మరీ అవకాశాలు ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. అలాగే పలు చిత్రాల్లోనూ నటించారు సత్తి.  అయితే చాలా సాదాసీదాగా మాట్లాడుతూ సాధారణంగా కనిపించే బిత్తిరి సత్తి ఆదాయం చూస్తే బిత్తర పోవాల్సిందే. ఈయన అసలు పేరు బహుశా అందరికీ తెలిసుండకపోవచ్చు, ఇత్తడి పేరు రవికుమార్. ఈయన చేవెళ్ల ప్రాంతాలకు చెందిన రైతు కుటుంబం నుండి వచ్చారు. ఇతడు పాడిన పలు పాటలు యూట్యూబ్ లో కూడా సంచలనం సృష్టించాయి. న్యూస్ చెప్పడం మాత్రమే కాకుండా అద్భుతంగా మిమిక్రీ చేస్తూ మొదట్లో ఫుల్ పాపులర్ అయ్యారు సత్తి. అయితే కెరియర్ ప్రారంభంలో నెలకు రూ. 15000 లు తీసుకునే బిత్తిరి సత్తి ప్రస్తుతం నెలకు రూ.5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది.

మొదట పని చేసిన మీడియా న్యూస్ ఛానల్ లో మొదట్లో కేవలం 25000 వేలు జీతం తీసుకునే వారని అయితే ఇపుడు బాగా పాపులర్ అయ్యాక రెండు చేతులా సంపాదిస్తుంది లక్షలు పోగేస్తున్నాడని తెలుస్తోంది.  సత్తి ఆ తరువాత వేరే ఛానల్ కు వెళ్లగా అక్కడ  రూ.3 లక్షల వరకు పెంచారని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రైవేటు యాడ్ లు కూడా చేస్తుండగా వీటి కోసం ఒక్కో యాడ్ కు.. రూ.7 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట బిత్తిరి సత్తి. ఇక ఇపుడేమో పెద్ద సినిమాలకు సంబంధించి స్టార్స్ తో ఇంటర్వ్యూ లు చేస్తూ ఏకంగా ఒక్కో షోకు లక్ష నుండి రెండు లక్షల వరకు  తీసుకుంటున్నాడని, ఇంటర్వ్యూ చెయ్యాల్సిన వ్యక్తిని బట్టి డిమాండ్  చేస్తున్నాడని టాక్. అందులో భాగంగా మహేష్ ను మరియు ఎఫ్ 3 టీమ్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అలా నెలకు 5 నుండి 8 లక్షల వరకు సంపాదిస్తూ చాలా బిజీబిజీ గా ఉన్నారట బిత్తిరి సత్తి.  

మరింత సమాచారం తెలుసుకోండి: