అందాల ముద్దు గుమ్మ సమంత గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఏం మాయ చేసావే మూవీ తోనే ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా మొదటి సినిమా తోనే తన అంద చందాలతో,  నటన తో, హావ భావాలతో ప్రేక్షకులను ఫిదా చేసిన సమంత అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే సమంత ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్  ద్వారా సమంత హిందీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా హిందీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సమంత ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ స్పెషల్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. పుష్ప సినిమా వచ్చి ఇప్పటికి చాలా కాలమే అవుతున్నా ఈ సాంగ్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇలా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా, పుష్ప మూవీ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సమంత తాజాగా ఓర్ మాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియా లోనే పది మంది స్టార్ హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత తనలో ఆలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకుణే, రష్మిక మందన్న, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్, పూజా హెగ్డే లు నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: