సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర కాస్త మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ టాక్ ప్రభావం ఏ మాత్రం చూపించకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొన్ని రోజుల పాటు సాధించింది.  కాకపోతే ఆ తర్వాత మెల్లి మెల్లిగా సర్కారు వారి పాట మూవీ  కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గుతూ వచ్చాయి. చివరగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొంత మేర నష్టాలనే మిగిల్చే విధంగా కనిపిస్తోంది. 24 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట మూవీ సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం...

నైజాం : 33.56 కోట్లు .
సీడెడ్ : 11.64 కోట్లు .
యూ ఎ : 12.61 కోట్లు .
ఈస్ట్ : 8.54 కోట్లు .
వెస్ట్ : 5.64 కోట్లు .
గుంటూర్ : 8.47 కోట్లు .
కృష్ణ : 5.87 కోట్లు .
నెల్లూర్ : 3.51 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ వారి పాట సినిమా 89.84 కోట్ల షేర్ ,  135.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.96 కోట్లు .
ఓవర్సిస్ లో : 12.68 కోట్లు .


24 రోజులకు  దాదాపుగా సర్కారు వారి పాట మూవీ  109.48 కోట్ల షేర్ , 178.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది. 121 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 11.52 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: