సాయి పల్లవి ,రానా , నవీన్ చంద్ర, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాని వరంగల్లో సంబంధించిన ఆత్మీయ వేడుకను కూడా నిర్వహించారు ఈ ఈవెంట్ కు మంచి స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో సాయిపల్లవి నటించిన వెన్నెల పాత్రను నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలియజేశారు. అయితే ఇది నిజ జీవితంలో సాయిపల్లవి నటించిన అమ్మాయి పేరు సరళ. ఈ సినిమాలో సరళ అనే పేరు పెట్టకుండా వెన్నెల అనే పేరు పెట్టారు.
ఇటీవల సాయి పల్లవి సరళ కుటుంబానికి ప్రత్యేకంగా కలుసుకొని వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా సాయిపల్లవి పట్టుచీర కూడా పెట్టడం జరిగింది తిరిగి రాని తన కూతుర్ని తనలో మళ్లీ తీసుకున్నట్లుగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. సాయి పల్లవి కూడా వారిని చూసి ఎమోషనల్ కు లోనైనట్లు గా తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అంచనాలు ఏర్పడ్డాయి తప్పకుండా ఈ సినిమా ఎమోషనల్ తో అందరికీ బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక డైరెక్టర్ కూడా ఈ చిత్రం మీద భారీ నమ్మకంతో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి