కియారా అద్వానీ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కీయారా అద్వానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు తన అంద చందాలతో, నటనతో కూడా కీయారా అద్వానీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేయాడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజ్ లభించింది.

ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే ఈ ముద్దుగుమ్మకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ కియారా అద్వాని కి మాత్రం మంచి గుర్తింపును తీసుకు వచ్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా,  దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా కియారా అద్వానీ నటించిన జుగ్‌ జుగ్‌ జియో సినిమా విడుదల అయ్యింది. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ రిలేషన్‌షిప్‌, తద్వారా వచ్చే సమస్యలపై స్పందించింది. కియారా అద్వానీ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ... నేను రిలేషన్‌షిప్‌లో ఉండి ఏదన్నా గొడవ జరిగితే సారీ చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడను, ఇబ్బంది అస్సలు పడను. ఎందుకంటే  ప్రతి మనిషికి ప్రేమ అనేది చాలా ముఖ్యం అని కియారా అడ్వాణీ  అన్నారు. ఇలా తాజా ఇంటర్వ్యూలో కియారా అద్వానీ రిలేషన్ షిప్ మరియు తద్వారా వచ్చే సమస్యలపై స్పందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: