ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు హీరో కార్తికేయ. అయితే ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోవడం లో ఈ హీరో విఫలం అయ్యాడు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో  మెల్ల మెల్లగా ఆయనకు వచ్చిన క్రేజ్ భారీ గా తగ్గిపోతుంది. ఇటీవలే విడుదలైన రాజా విక్రమార్క సినిమా కూడా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించక పోవడంతో ఆయన కనుమరుగై పోయాడు.

ఇంకొక వైపు విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ సినిమాలు కూడా ఆయన కు సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అన్న సందిగ్ధత లో కార్తికేయ ఉన్నాడు. ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా పైనే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే ఆయనను ప్రేక్షకులు తెరపై చూడటానికి ఇష్టపడతారు. లేదంటే కనుమరుగైపోయినా హీరోల జాబితాలో ఈయన కూడా చేరడం జరుగుతుంది. 

వాస్తవానికి యువతలో కార్తికేయ కు మంచి క్రేజ్ ఉంది భారీ స్థాయిలోనే ఫాలోయింగ్ ఉంది. దాన్ని కాపాడుకుం టూ మంచి సినిమాలు చేస్తే తప్పకుండా ఈ హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఈ హీరోతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంటే కథల విషయంలో క్లారిటీ లేకుండా ముందుకు వెళ్లడం ఆయన కెరియర్ ను దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా కార్తికేయ తన సినిమాల కథల పట్ల ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది అని ఆయన అభిమానులు చెబుతున్నారు.  నటుడిగా ఆయన ఏ స్థాయిలో నటించగల సత్తా ఉన్న నటుడో అందరికీ తెలిసిందే. ఆ నటన కు తగ్గ సినిమా పడితే తప్పకుండా ఈ హీరో మళ్లీ కోలుకోవడం గ్యారెంటీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: