విజయ్ దేవరకొండ తరువాత యూత్ లో విపరీతమైన క్రేజ్ హీరోల లిస్టులో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ముందు వరసలో ఉంటాడు. అతడు నటించిన సినిమాల సంఖ్య తీసుకుంటే కనీసం 5 కూడ పూర్తికాలేదు. అయితే ‘డీజే టిల్లు’ తరువాత ఈయంగ్ హీరో మ్యానియా విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగా సిద్దూ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి రచయిత స్క్రీన్ ప్లే రైటర్ కూడ.


వాస్తవానికి ‘డీజే టిల్లు’ మూవీకి విమల్ కృష్ణ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించినప్పటికీ ఆసినిమాకు సంబంధించిన కథ మాటలు స్క్రీన్ ప్లే అంతా జొన్నలగడ్డ చూసుకున్నాడు. ఈమూవీ ఘనవిజయంతో దర్శకుడు విమల్ కృష్ణకు పెద్దగా పేరు రాలేదు కానీ ఇమేజ్ అంతా జొన్నలగడ్డ సిద్దు ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీనితో సిద్దూకు నాలుగు ఐదు సినిమాలలో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలు అన్నీ వరసపెట్టి ఒప్పుకోకుండా తనకు బాగా నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు.


అయితే ఇప్పుడు ఆసినిమాలను పక్కకుపెట్టి సిద్దు ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ తీయాలి అన్నఆలోచనలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ ను సిద్దూ పూర్తి చేయడంతో ఈమూవీ త్వరలో షూటింగ్ కు వెళ్ళబోతోంది. అయితే ఈసీక్వెల్ కు సిద్దు తానే స్వయంగా దర్శకత్వం వహిస్తాడని టాక్. దీనితో ఈమూవీ దర్శకుడు విమల్ కృష్ణకు సిద్దూ ఎందుకు అవకాశం ఇవ్వలేదు అన్నసందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ఈసీక్వెల్ నిర్మాతలు మటుకు వేరే విధంగా చెపుతున్నట్లు తెలుస్తోంది.


విమల్ కృష్ణ ఇప్పటికే వేరే సినిమాను ఒప్పుకోవడంతో ఆసినిమా పూర్తి అవ్వడానికి చాలసమయం పడుతుంది కాబట్టి ‘డీజే టిల్లు’ సీక్వెల్ బాధ్యతను సిద్దు కు అప్పగించవలసి వచ్చింది అని చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సీక్వెల్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ఈమూవీని కూడ సంక్రాంతి రేసులో భారీ సినిమాల మధ్య పోటీలో నిలపాలని ఈమూవీ నిర్మాతల స్ట్రాటజీ అంటున్నారు. ఈమూవీకి ఉన్న క్రేజ్ రీత్యా సంక్రాంతి ఫీవర్ కూడ కలిసివస్తే ఈయంగ్ హీరో సినిమాకు భారీ కలక్షన్స్ వస్తాయి అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్..  





మరింత సమాచారం తెలుసుకోండి: