తమిళ హీరోలకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ వారు నటించే సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా ఓ సినిమా చేయడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా పలువురు తమిళ హీరోలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్ట్ గా సినిమాలు చేస్తుండగా హీరో కార్తీ మాత్రం తెలుగు చిత్రాలపై దృష్టి పెట్టకపోవడం ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.

ఆయన తొలి చిత్రం నుంచి తెలుగు నాట ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు. ఒక్కో సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ విధంగా మంచి విజయాలను సైతం అందుకొని భారీ అభిమానాన్ని తెలుగులో సొంతం చేసుకున్న కార్తీ ఇప్పుడు వీరుమాన్ అనే ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను చూస్తుంటే దీనికి తెలుగు వెర్షన్ లేదన్నట్లు అనిపిస్తుంది. శంకర్ కుమార్తె అదితి శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ సినిమా కేవలం తమిళంలోనే విడుదల అవుతుంది అన్నట్లుగా పరిస్థితి ఉంది.

అయితే దేనికి కార్తీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయలేకపోతున్నాడో అర్థం కావట్లేదు అని దీనిపట్ల ఆయన అభిమానులు కొంత కోపాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఆయన ప్రతి సినిమాకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటిది ఆయన గత సినిమా సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా విడుదల చేయకపోవడం నిజంగా ఆయనకు ఆయన మార్కెట్ పై ఎంతో ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మరి చిత్ర బృందం ఏ విధమైన ప్లాన్ తో కేవలం తమిళంలోనే ఈ సినిమాను విడుదల చేస్తుందో. 

ఇటీవలే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఎంతో హడావుడిగా కొనసాగుతున్నాయి. సూర్య ఈ చిత్రానికి గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరి తెలుగు వర్షన్ పై మరొకసారి ఆలోచిస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: