కళ్యాణ్ రామ్ తాజాగా మల్లాడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో క్యాథరీన్ , సంయుక్త మీనన్  హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా , ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ కి అదిరి పోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ లభించింది.

ఇలా మొదటి రోజే ఈ మూవీ కి అద్భుతమైన టాక్ లభించడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 5 రోజుల బాక్సా ఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకున్న బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుందో తెలుసుకుందాం. నైజాం : 7.45 కోట్లు , సీడెడ్ : 4.58 కోట్లు , యూ ఏ : 2.98 కోట్లు , ఈస్ట్ : 1.31 కోట్లు , వెస్ట్ : 96 లక్షలు , గుంటూర్ : 1.57 కోట్లు , కృష్ణ : 1.13 కోట్లు , నెల్లూర్ : 64 లక్షలు .రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో  బింబిసార మూవీ 20.62 కోట్ల షేర్ , 32.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.35 కోట్లు .ఓవర్ సీస్ లో :  1.65 కోట్లు .ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు గాను బింబిసార మూవీ 23.62 కోట్ల షేర్ , 39.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో బింబిసార మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: