టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా , అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది.

అలా కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా కార్తికేయ 2 మూవీ తెరకెక్కడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు కలిగి ఉండటంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

నిజాం : 4 కోట్లు ,
సీడెడ్ : 2 కోట్లు ,
ఆంధ్ర : 6 కోట్లు ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కార్తికేయ 2 మూవీ కి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 0.80 కోట్లు .
ఓవర్ సీస్ లో : 1.40 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో : 3 కోట్లు . మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 18 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయవలసి ఉంది. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: