మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస పెట్టి క్రేజీ మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.  ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం ధమాకా అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సినిమా చూపిస్త మావ , నేను లోకల్ , హలో గురు ప్రేమకోసమే వంటి మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ లో రవితేజ సరసన పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ ని దర్శకుడు త్రినాథరావు నక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ నుండి 'జింతక్' అనే మాస్ లిరికల్ సాంగ్ ని ఆగస్ట్ 18 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. తాజాగా ధమాకా మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ మరియు శ్రీ లీల ఉన్నారు. ఈ పోస్టర్ లో రవితేజ మరియు శ్రీ లీల మాస్ మూమెంట్ స్టెప్ లు వేస్తున్నారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి బీమ్స్ సిసిరోయిలో సంగీతాన్ని అందిస్తుండగా , కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: