టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ హీరోగా క్రేజ్ వున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . గోపీ చంద్ ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా , విలన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసు కున్నాడు .

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా , విలన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గోపీ చంద్ పోయిన సంవత్సరం విడుదల అయిన సిటిమర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందు కున్నాడు . సిటీ మార్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న గోపిచంద్ ఈ సంవత్సరం ఇప్పటికే పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . మంచి అంచనాల నడుమ విడుదలైన పక్కా కమర్షియల్ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది .

ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన గోపీ చంద్ తన తదుపరి మూవీ ని సంపత్ నంది దర్శకత్వం లో చేయ బోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇది వరకే గోపీ చంద్ , సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద మరియు సిటిమార్ మూవీ లు తెర కెక్కాయి. ఈ రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మూడో మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: