ప్రస్తుతం తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికి సంబంధించి సంగీత దర్శకుడు తమన్ తో ఎప్పుడో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి.ఇంకా అలాగే 3 పాటల షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఫ్రెష్ గా మరోసారి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈసారి శంకర్ సినిమా కాదు,ఆ తరువాత వచ్చే కొత్త సినిమా.ఇక జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు అనిరుధ్ రవి చందర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి గౌతమ్-అనిరుధ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ ని మొదలుపెట్టారు.నిజానికి అయితే ఈ కార్యక్రమం ఇప్పుడు జరగాల్సింది కాదు. అనుకోని విధంగా రామ్ చరణ్ ఇంకా శంకర్ సినిమా ఆగింది.


కమల్ హాసన్ తో చేయాల్సిన ఇండియన్-2 సినిమా కోసం శంకర్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో గౌతమ్ తిన్ననూరి తన ప్రాజెక్టుకు మెరుగులు దిద్దుతున్నాడు చరణ్. పనిలో పనిగా తన సినిమా సంగీత చర్చలు కూడా మొదలుపెట్టాడు.ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు అనిరుధ్. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ సినిమా వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ ఇంకా ఎంవీఆర్ సినిమాస్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు.కాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇటీవల ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేసి రామ్ చరణ్ కి, చిరంజీవికి వినిపించగా అది వారికి చాలా బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: